Andhrapradesh
హంద్రీనీవా ద్వారా లబ్ధి పొందని మిగులు గ్రామాలకు సాగు నీరు అందించాలని జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య కి మెమోరాండం సమర్పించిన లోక్ సత్తా పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి రామదాసు గౌడ్.
దేవనకొండ మండల పరిధిలోని హంద్రీనీవా ద్వారా లబ్ధి పొందని గ్రామాలు భైరవ కుంట,బుర్ర కుంట, వెంకటాపురం,నేల తలమారి, గుడిమెరాళ్ల , బంటుపల్లి, చెల్లెల చెలెమిల,బేతపల్లి బండపల్లె,పల్లె దొడ్డి గ్రామాలకు హంద్రీనీవా ద్వారా పంటలు పండించుకోవటానికి నీటి సరఫరా లేనందున ఈ గ్రామాల ప్రజలు నిత్యం వలసలు వెళుతూ చిన్న సన్నకారు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య శరణ్యమని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని లోక్ సత్తా పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి ఇ.రామదాసు గౌడ్ జాయింట్ కలెక్టర్ నారాపురెడ్డి మౌర్య కి తెలపడం జరిగినది.
ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి హంద్రీ నివా ద్వారా లబ్ధి పొందని మిగులు గ్రామాలను గుర్తించి నీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని లోక్ సత్తా పార్టీ దేవనకొండ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు మాల కిషోర్ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయలో ఏర్పాటు చేసిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కి మెమోరాండం సమర్పించడం జరిగినది తదనంతరం జాయింట్ కలెక్టర్ నారాపురెడ్డి మౌర్య సానుకూలంగా స్పందించి మండలంలోని మిగులు గ్రామాలకు హంద్రీనీవా ద్వారా నీళ్లు అందే విధంగా ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వారన్నారు.
ఈ కార్యక్రమంలో లోక్ సత్తా పార్టీ, ఆదోని డివిజన్ కన్వీనర్ సి శేఖర్ దేవనకొండ మండలం నాయకులు ఓబుల్ రెడ్డి నీలకంఠ పెద్దరాజు, పల్లె దొడ్డి రామాంజనేయులు,అలారు దిన్నె బుగ్గ,భైరవ కుంట తలారి రంగముని,పల్లె దొడ్డి కిష్టన్న,గుమ్మరాళ్ల,అంజనేయులు,జయరాంయాదవ ప్రసాదు జాన కుమార్ మరియు తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.