Andhrapradesh
పాలస్తీనా పై ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాక్రమణ దాడులను ఖండించండి!!
పాలస్తీనా ప్రజలకు ఆహార పదార్థాలను, నిత్యవసర వస్తువులను అందకుండా చేస్తూ అమెరికా సామ్రాజ్యవాద అండతో పాలస్తీనా పై దురాక్రమణ యుద్ధానికి పాల్పడుతున్న ఇజ్రాయిల్ చర్యలను నిరసిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO) ఆధ్వర్యంలో అర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొన్న ఆదోని పట్టణ అధ్యక్ష కార్యదర్శులు శివ, అశోక్ మాట్లాడుతూ పాలస్తీనాపై ఇజ్రాయిల్ దురాక్రమణ దాడులు, యుద్ధం ఫలితంగా 724 మంది చిన్నారులు,458 మహిళలు,మొత్తంగా 2,215 మంది పాలస్తీనా పౌరులు మరణించారు.అమెరికా సామ్రాజ్యవాదం అర్బన్ దేశాలలో ఇజ్రాయిల్ ను తన స్థావరంగా ఉంచుకొని చమురు నిల్వలపై ఆధిపత్యం సాధించడం కోసం, యుద్ధాన్ని రెచ్చగొడుతుందని, నేడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులన్నీ కూడా నిజా నిజాలు తెలియకుండా షేర్ చేస్తున్నవేనని, శరణార్థులుగా ప్రవేశించిన యూదులు నేడు అమెరికా అండతో పాలస్తీనాను ప్రపంచ పటం నుండి తొలగించడం కోసం దురాక్రమ దాడులకు పాల్పడుతున్నారని, ఇజ్రాయిల్ చర్యలకు వ్యతిరేకంగా ప్రజలందరూ నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉందని ,పాలస్తీనా భూభాగం నుండి ఇజ్రాయిల్ వెంటనే వైదొలగాలని డిమాండ్ చేస్తూ, పాలస్తీనా ప్రజలకు పిడిఎస్ఓ సంఘీభావంగా నిలబడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా సెల్ కన్వీనర్స్ నికిత, కృష్ణవేణి, సాయి,అశోక్, ప్రవీణ్,నవీన్, తదితరులు
BOYA ASHOK
October 17, 2023 at 7:06 am
BOYA ASHOK
BOYA ASHOK
October 17, 2023 at 7:30 am