Andhrapradesh
చిప్పగిరి లో బాబు కోసం పూజలు.
86 Views
ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే.శ్రీమతి కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరిలో బుధవారం మధ్యాహ్నం 03.00 గంటలకు చిప్పగిరి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు అందరూ భంభం స్వామి దర్గా దగ్గర నుండి విజయదాసరికట్ట వరకు పాదయాత్ర చేయడం జరిగింది.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి కేంద్ర కారాగారంలో అక్రమంగా నిర్బందించిన నేపథ్యంలో చంద్రబాబు ఆయురారోగ్యాలతో త్వరగా విడుదల కావాలని పూజలు చేయడం జరిగింది.కావున ఈకార్యక్రమంలో చిప్పగిరి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు TNSF, ITDP,TNTUC, తెలుగుదేశం పార్టీ అనుబంధసంఘాలసభ్యులు కోట్ల అభిమానులు, NTR అభిమానులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.