Andhrapradesh
పేదవారి ఆరోగ్యం పట్ల చిత్త శుద్ధి ఉన్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రేస్ ప్రభుత్వం మాత్రమేనని పేర్కొన్న ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి.
పేద వారి ఆరోగ్యం పట్ల చిత్త శుద్ధి ఉన్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ ప్రభుత్వం మాత్రమేనని నిరూపించామని నంద్యాల శాసనసభ్యులు శిల్పారవి రెడ్డి పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా నంద్యాల మండలం కానాల గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ నందు గ్రామంలోని పేద ప్రజలకు వైద్యలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. జగనన్న ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా, కుల, మతాలకు అతీతంగా పారదర్శక పాల అందించడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హామీలనే కాకుండా చెప్పని వాటిని కూడా అమలు చేస్తూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తున్నారని అన్నారు. ప్రజల ముంగిటకే ప్రభుత్వం తీసుకువచ్చి గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అలాగే వారి యోగ క్షేమాలను, స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని అక్కడి క్కడే ప్రభుత్వ అధికారుచేత పరిష్కరించే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. విద్య, వైద్య, రైతులకు అన్ని పథకాలు, పేద ప్రజలకు జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్ ద్వారా అనేక వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. పేద ప్రజల పక్షాల నిలిచిన జగనన్న ప్రభుత్వానికి అండగా నిలవాలని రానున్న రోజుల్లో మరో సారి జగనన్న ప్రభుత్వం అధికారం చేపట్టాలని రాష్ట్రనికి ఉజ్వల భవిషత్తును అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. టీడీపీ నాయకులు అభివృద్ధి ఎక్కడ జరిగింది అన్న ప్రశ్నకు ప్రతి రోజు నంద్యాల నియోజకవర్గంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. నంద్యాలలో పేదలకు ఇచ్చే ఇళ్లపై, మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తుంటే ఆ స్థలాలపై కోర్టులకు వెళ్లిన టీడీపీ వారికి నంద్యాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడంలేదా అని సూటిగా ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమని, అభివృద్ధిని అడ్డుకుంటున్నది. టీడీపీ నాయకులన్నది ప్రజలు గమనిస్తున్నారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్లను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ దూదేకుల బాపమ్మ, వైసీపీ నాయకులు విజయశేఖర్ రెడ్డి , జగదీశ్వర్ రెడ్డి ,ఎంపీడీఓ సుగుణశ్రీ, వైద్యులు, ఏఎన్ఎంలు, ఐసీడీఎస్ సిబ్బంది, ఆశావర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.