Andhrapradesh
మండల సమస్యలపై గళం విప్పిన జడ్పిటిసి రొంగుల పద్మావతి.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలపై గళం విప్పిన బిక్కవోలు మండలం జడ్పిటిసి,జిల్లామహిళా స్థాయి సంగం చైర్మన్ రొంగల పద్మావతి అప్పాజీ. ముందుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా రెండు సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ విప్పత్తి వేణుగోపాల్ రావు కి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం సభలో మాట్లాడుతూ రైతులు ధాన్యం సేకరణలో ఇబ్బందులు గురించి .రోడ్లు పరిస్తుతులు గురించి .మండలంలో రక్త హీనత సమస్యలు గురించి తన గళం వినిపించారు అనంతరం జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతం అవినందున సభా పూర్వకంగా అభినందలు తెలియపరిచారు .సొంత స్థలం లో ఇల్లు నిర్మాణం నిధులు మంజూరు గురించి .హైస్కూల్స్ నందు ఉపాద్యాయులు భర్తీ గురించి .హైస్కూల్స్ నందు నాన్ ఎడ్యుకేషన్ స్టాప్ భర్తీ గురించి మరియు మండలంలోని పలు సమస్యలపై ప్రస్తావించారు.