Andhrapradesh
రైతు పండించిన పంటలకు మద్దతు ధర చట్టం చేయాలి
కార్పొరేట్లకు రెడ్ కార్పొరేట్ రైతుల పై ముళ్ళ బుల్లెట్లు కురిపిస్తున్న మోడీ.
దేవనకొండ -/ నేటి భారత్ : కేంద్రంలోనీ నరేంద్రమోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు రెడ్ కార్పొరేట్ల పరుస్తూ రైతాంగం పై ముళ్ల బుల్లెట్లు వర్షం కురిపిస్తుందని ఈ దుర్మార్గం వైఖరిని ఖండించాలని అదేవిధంగా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీర శేఖర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే మద్దిలేటి శెట్టి లు డిమాండ్ చేశారు,
రైతుల కనీస మద్దతు ధర, స్కీం వర్కర్ల కనీస వేతనాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన గ్రామీణ భారత్ బంద్ సందర్భంగా దేవనకొండ మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుండి ర్యాలీ, బస్టాండ్ దగ్గర రాస్తారోకో నిర్వహించారు సిఐటియు మండల కార్యదర్శి అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతు గతంలో వేలాది మందితో రైతంగం చేసిన ఉద్యమ ఫలితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం రంగం లోని నల్ల చట్టాలను రద్దు చేస్తాను అని హామీ ఇచ్చి, వాటిని అమలుపరచడానికి తిరిగి ప్రయత్నం చేస్తున్నది .విద్యుత్ చట్ట సవరణ బిల్లు పార్లమెంటు ముందు పెట్టి ఉచిత విద్యుత్ కు మంగళం పాడి రైతుల పై పెనుబారం మోపడానికి సిద్ధమైందని,కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం సామాన్య ప్రజల నిత్యావసర వస్తువుల్ల అన్నిటి పైన జిఎస్టి పేరుతో పన్నులు పెంచిందని అన్నారు .గత 10 సంవత్సరంలో బిజెపి ప్రభుత్వం అనుసరించిన విధానాలు వల్ల అదాని, అంబానీలు ప్రపంచ కుబేరుల జాబితాలో చేరగా ,పేద ప్రజలు, రైతులు ,కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు లక్ష యాభై వేల మంది బలస్మరణం పాలయ్యారని వారన్నారు.
మండలంలో సంవత్సరం వర్షాలు లేక తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పుల పాలై బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలు వలసలు పోతున్నరని రైతులు ఎకరానికి లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయారని మండలాన్ని ప్రభుత్వము కరువు మండలంగా ప్రకటించి, ప్రభుత్వం కరువు సాయం ఇవ్వడం లేదని విమర్శించారు రైతులకు పంట నష్ట పరిహారం అందించి, బ్యాంకు రుణాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఉపాధి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికే 200 కల్పించాలని ,స్కీం వర్కర్లకు 26వేల వేతనం ఇవ్వాలని, దుర్మార్గంగా కార్పొరేట్ లకు ఆనుకూలంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో ఉభయ రైతు సంఘల మండల కార్యదర్శిలు సూరి, వెంకటేశ్వర్లు సిఐటియు సీనియర్ నాయకుడు నాగేష్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బజారి, పరమేష్, యూసుఫ్ భాష, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి శ్రీనివాసులు, రైతు సంఘం నాయకులు శ్రీరాములు ,బడే సాబ్, రైతు, వ్యవసాయ కార్మిక సంఘం యువజన సంఘాల నాయకులు కే పి రాముడు, లక్ష్మిరెడ్డి, బలరాముడు, నాగేంద్ర, వీరేంద్ర ,రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.