Andhrapradesh

రైతులకు తీరని అన్యాయం చేస్తున్న ప్రభుత్వం

Published

on

278 Views

తక్షణమే పంట నష్టపరిహారం రైతుల ఖాతాలకు జమ చేయాలి.

బ్యాంకుల్లో రైతుల అప్పులను షరతులు లేకుండా రద్దు చేయాలి.

కరువు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం.

సిపిఐ ఆధ్వర్యంలో దేవనకొండ తహశీల్దార్ కార్యాలయం ముట్టడి. డిమాండ్

ఈ ఖరీఫ్ సాగు లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పోరాటాల ఫలితంగా మండలాన్ని కరువు మండలంగా ప్రకటించారు కానీ నేటికీ నష్ట పరిహారం ఇవ్వాలన్న ఆలోచన కూడా పాలక వర్గం చేయక పోవడం చాలా అన్యాయమని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు కె.మద్దిలేటిశెట్టి ఆరోపించారు.

ఈ సందర్భంగా సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక సీపీఐ కార్యాలయం నుండి ర్యాలీగా నినాదాలు చేస్తూ రైతులతో కలిసి వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఏపీ రైతుసంఘం మండల కార్యదర్శి ఎమ్.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు కే. మద్దిలేటిశెట్టి హాజరై మాట్లాడుతూ జిల్లాలో సిపిఐ నిర్వహించిన పోరాటాల ఫలితంగా 24 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

కరువు సహాయక చర్యలు చేపట్టకుండా రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది,దీని కారణంగా రైతులకు తీరని అన్యాయం జరుగుతున్నదన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 20 మందికి పైగా రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదన్నారు.

ఏ సీజన్లో రైతులు పంటలు నష్టపోతే ఆ సీజన్లోనే పంట నష్టపరిహారం ఇస్తామని ప్రచారం చేసుకుంటున్న C.M జగన్ రెడ్డి కరువు మండలాలపై, పంట నష్టపరిహారం పై నోరు మెదపడం లేదన్నారు.

దీని కారణంగా రైతులకు ప్రజలకు తీరని అన్యాయం జరుగుతున్నదన్నారు.తక్షణమే జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని,పంట వేసి నష్టపోయిన ప్రతి రైతుకు పంట నష్టపరిహారం రైతుల ఖాతాలకు జమ చేయాలని అన్నారు.

సీపీఐ మండల కార్యదర్శి ఎమ్.నరసరావు మాట్లాడుతూ దేవనకొండ మండలంలో కరువు సహాయక చర్యలు చేపట్టాలన్నారు.పంట వేసి నష్టపోయిన ప్రతి రైతుకు పత్తి,వేరుశనగ, ఆముదము,కంది,జొన్న, కొర్ర,సజ్జ,పంటలకు ఎకరాకు 40 వేల రూపాయలు నష్టపరిహారం రైతుల ఖాతాలకు జమ చేయాలన్నారు.

అలాగే ఉల్లి,మిర్చి,ఉద్యాన వన పంటలకు 1లక్ష రూపాయలు పంట నష్టపరిహారం ఇవ్వాలన్నారు. మండలంలో ఏర్పడిన త్రాగునీటి సమస్య కు యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల గౌరవాధ్యక్షులు వై.కండప్ప, సిపిఐ మండల సహాయ కార్యదర్శి నరసింహులు,పట్టణ సహాయ కార్యదర్శి వి.రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు సి.కృష్ణ, గుడిమిరాళ్ల శాఖ కార్యదర్శి తుకారాం,నల్లచెలిమల శాఖ కార్యదర్శి బజారి,ప్యాలకుర్తి శాఖ కార్యదర్శి అశ్వత్ధామ,కరివేముల బాలాజీ,రైతు సంఘం నాయకులు ప్రసాద్, కిష్టన్న, పెద్ద రంగన్న, హనుమంతు, బాషా, శ్రీనివాసులు, రంగస్వామి, వీరంజినేయులు, ఈరన్న, విద్యార్థి,యువజన సంఘం నాయకులు మధు,రామంజి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version