Andhrapradesh
నెల్లిబండలో అయోధ్య అక్షింతలఊరేగింపు.
దేవనకొండ మండలం నెల్లిబండ గ్రామంలో గ్రామ విచారమంచ్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామ అక్షింతలను పురస్కరించుకొని ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో గోమాతను కూడా ఊరేగింపు నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వచ్చి గోమాతలకు నుండు కడవలతో నీళ్లు పోసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అనేకమంది అయోధ్య రామ జన్మభూమి గురించి వివరించారు. హిందువులందరూ ఏకం కావాలని హిందువుల మధ్య ఐక్యత నెలకొనాలని చెప్పారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి కార్యదర్శి శ్రీ సావిత్రి , ఆర్ఎస్ఎస్ ఆరోగ్య భారతి జిల్లా విభాగ్ కార్యవాహ కృష్ణవేణి, గ్రామ వికాస్ సమితి శ్రీనివాసులు, మల్లికార్జునరెడి,వి హెచ్ పి.భీమేష్ కరివేముల కౌలుట్లయ్య, ఎస్ఎస్ఎఫ్ వీరేష, గుమ్మ రాళ్ల రామాంజనేయులు, కరిడికొండ ఉరుకుందు ఆచారి, అలారుదిన్నె రామచంద్రారెడ్డి, రామాంజనేయులు ఉరుకుందు ఆచారి ఉరుకుంద ఆచారి , ఆర్ఎస్ఎస్ కండ కార్యవాహ ఉచ్చీరప్ప తదితరులు పాల్గొన్నారు.