Andhrapradesh
కరువు ప్రాంత విద్యార్థులకు అన్ని రకాల ఫీజులను రద్దు చేయాలి.
ప్రతి విద్యార్థికి ప్రత్యేక కరువు స్కాలర్ షిప్ ద్వారా 15,000 రూపాయలను అందజేయాలి.
ప్రత్యేక మరియు సీజనల్ హాస్టల్ లను ఏర్పాటు చేయాలి.
ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శరత్ కుమార్.
కరువు ప్రాంత విద్యార్థులకు అన్ని రకాల ఫీజులను రద్దు చేసి,తక్షణమే ప్రత్యేక కరువు స్కాలర్ షిప్ ద్వారా 15,000 రూపాయలను ఇవ్వాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శరత్ కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి,అనంతరం ఆర్ఐ వెంకటేశ్వర్లు కు వినతిపత్రాన్ని అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా దేశంలో నే అత్యంత వెనకబడిన జిల్లా,నిత్యం కరువుకాటకాలతో సతమతమవుతున్న ప్రాంతమని అన్నారు. జిల్లాలోని రైతులు కరువుకాటకాలతో అల్లాడుతూ, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల కుటుంబం నుంచే చాలా మంది విద్యార్థులు ఉన్నారని అన్నారు.ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఉపాధి లభించక,ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని,వారితో పాటు వారి యొక్క పిల్లలను కూడా తీసుకెళ్తున్నారని అన్నారు.పిల్లలకు చదువుకోవాలని ఉన్నప్పటికీ, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితులు బాగలేక,చదువును మధ్యలోనే వదిలేసి,బాలకార్మికులుగా చాలా మంది విద్యార్థులు మారారని అన్నారు.ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఈ జిల్లాలోని పరిస్థితిలో దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు అన్ని రకాల ఫీజులను రద్దుచేసి, ప్రతి విద్యార్థికి ప్రత్యేక కరువు స్కాలర్షిప్ ద్వారా 15 వేల రూపాయలను ఇవ్వాలని, ఈ ప్రాంతంలో సీజనల్ లేదా ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటు చేయడం ద్వారా ఇలాంటి పరిస్థితులను రూపుమాపేందుకు దోహద పడుతుందన్నారు. కరువు ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టేంతవరకు ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్ష,కార్యదర్శులు మధు,భాస్కర్ నాయకులు నరేష్ ,సురేంద్ర విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.