Andhrapradesh
మృతి చెందిన విఆర్ఏ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం.
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం లోని గుడిమిరాళ్ళ గ్రామ రెవెన్యూ సహాయకులు సుంకన్న అనారోగ్యంతో మృతి గ్రామ రెవెన్యూ సహాయకులు సుంకన్న మృతి పట్ల దేవనకొండ తహశిల్దార్ వెంకటేష్ నాయక్ ఆదివారం ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత 40 ఏళ్ల పైబడి గ్రామంలో రైతులు, ప్రజల పట్ల సఖ్యతగా ఉంటూ ప్రజల అవసరాలకు ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేరవేసే సంక్షేమ సమాచారాలను ఎప్పటికప్పుడు చేరవేస్తూ గ్రామ ప్రజల మన్ననలను పొందుతు నియమ నిబద్ధతతో పనిచేసే మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. అనారోగ్య కారణం చేత మృతి చెందిన సుంకన్న కుటుంబంలో ప్రభుత్వ నిబంధనల మేరకు వీఆర్ఏ గా అర్హులైన వారికి వీఆర్ఏ ఉద్యోగంతో పాటు ప్రభుత్వం ద్వారా వచ్చే బెనిఫిట్స్ ను తొందరలోనే అందేలా చూస్తామన్నారు. అనంతరం దహన సంస్కారాలకు 15 వేల రూపాయలను గ్రామ రెవెన్యూ అధికారి ఆనంద్ కుమార్ చేత అందించడం జరిగిందన్నారు. మృతి పట్ల డిప్యూటీ తహశిల్దార్ సుదర్శన్ ,సీనియర్ సహాయకులు వెంకటేష్ , వి ఆర్ ఒ ల సంఘము మండల అధ్యక్షులు దాధావలి, మునీర్, చంద్ర, శేకన్న,హరికృష్ణ, సుంకన్న, రాజన్న, కౌలుట్ల,సుమన, మదునావతి, రామేశ్వరి, సలోమి,సూరి, జాకీర్ వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు రామాంజనేయులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు