Andhrapradesh

దేవనకొండ లో విద్యాసంస్థల బంద్ విజయవంతం ఏఐఎస్ఎఫ్ – ఏఐవైఎఫ్.

Published

on

221 Views

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఉపసంహా రించుకోవాలని, కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో కేజీ నుండి పీజీ వరకు విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్ష,కార్యదర్శులు మధు,భాస్కర్ ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష,కార్యదర్శులు రవి,రామాంజనేయులు తెలిపారు.

అనంతరం వారు మాట్లాడుతూ అనేక త్యాగాలతో విద్యార్థి యువజన నాయకుల 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకోవడాన్ని నిరసిస్తూ జరుగుతున్న పోరాటం నవంబర్ 8 నాటికి వెయ్యి రోజులు అవుతున్న సందర్భంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడంతో పాటు నవంబర్ 8వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కి పిలుపునిచ్చారు.

లాభాలు వస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఈ ఫ్యాక్టరీ అనుబంధంగా ఇనుము గనులు కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపయోగపడుతున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాడిన అమరవీరుల త్యాగాలు స్ఫూర్తితో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు ఐక్యం చేస్తామన్నారు. రాయలసీమ ప్రాంతం కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్న హామీ ఇంతవరకు ఏ మాత్రం అమలు చేయలేదని తెలిపారు కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయితే లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు.

కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధికి నిధులు ఇవ్వకపోయినా నూతన పరిశ్రమలు ఏర్పాటు వంటి విభజన హామీలు అన్నిటిపై నిర్లక్ష్యం చేస్తూ రాష్ట్రంలోని బిజెపి నేతలు మోడీని ఎందుకు అడగడం లేదని విమర్శించారు.. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ పెద్దలు నిద్ర నటిస్తున్నారని రాష్ట్ర ప్రయోజనాల కంటే ముఖ్యమంత్రికి వ్యక్తిగత ప్రయోజనాలు ఎక్కువ అయ్యాయని ఆరోపించారు కేసుల భయంతో మోడీ ముందు మోకరిల్లుతున్నారని భయపెట్టారు రాష్ట్ర విభజన హామీలలో ప్రధానమైన కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేంద్రం ఒక్క పైసా కూడా నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటు అన్నారు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం రెండు సార్లు శంకుస్థాపన చేసిన ఆచరణలో పురోగతి లేదన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి స్థానిక యువతికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం వామపక్ష విద్యార్థి,యువజన సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని బలమైన ఉద్యమాలకు శ్రీకారం చుడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు జిల్లా నాయకులు రంగన్న, సింహాద్రి,సురేంద్ర, కళాశాల పాఠశాలల విద్యార్థినీ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version