హంద్రి నీవా కు గుండ్లకొండ దగ్గర స్లూయిజ్ ఏర్పాటు చేసి కోటకొండ వరకు సాగునీరు ఇవ్వాలి.
హంద్రీనీవా ద్వారా మండలంలోని చెరువులకు నీళ్లు నింపాలి.
గుండ్లకొండ దగ్గర హంద్రీనీవాకు స్లుయిజ్ ఏర్పాటు చేసి కోటకొండ ,మాచాపురం గ్రామాల వరకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అదే విధంగా మండలం లోని చెరువులన్నింటికీ హంద్రీనీవా ద్వారా నీళ్లు మళ్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేవనకొండ మండల కేంద్రంలో 30 గంటల నిరవధిక దీక్షను రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ ప్రారంభించారు.
బుధవారం స్థానిక పాత తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా 30 గంటలు నిరవధిక దీక్షను ప్రారంభించారు, రైతు సంఘం మండల కార్యదర్శి సూరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ లు మాట్లాడుతూ నిత్యం కరువుతో అల్లాడుతున్న దేవనకొండ మండలం లో సాగునీటికి అనేక అవకాశాలు ఉన్నాయని కానీ పాలకుల చిత్తశుద్ధి లోపం బాధ్యతారహిత్యం ప్రజల పట్ల,ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వలన మండల ప్రజానీకం నిత్యం కరువుకాటకల అల్లాడుతున్నారని విమర్శించారు.
కరువు నుండి శాశ్వతంగా విముక్తి చేసే అవకాశం ఉందని మండలం లోని పై తట్టు గ్రామాలైన గుండ్లకొండ, గుడిమరాళ్ల,బంటుపల్లి, బేతపల్లి, చేలీమ చలిమిల,బండపల్లి, కోటకొండ, వెంకటాపురం, పల్లె దొడ్డి, బురకుంట, మాచాపురం గ్రామాలకు సాగునీరు కోసం గుండ్లకొండ దగ్గర ఏర్పాటు చేస్తే గ్రావిటీ కింద 20 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉందని అదే విధంగా గుండ్లకొండ బానకుంట, గుడిమిరాళ్ళ నెమళ్ళ బండ, తుమ్మలచెరువు, బంటుపల్లి చెరువు, బండపల్లి చెరువు, కోటకొండ చిన్నోని చెరువు మాచాపురం పెద్ద చెరువు, నేలతల మరి చెరువు, బుర్రకుంట గ్రామాల చెరువులకు హంద్రీనీవా ద్వారానీళ్లు మళ్లించవచ్చని వారు తెలిపారు.
అధికారం కోసం అనేక హామీలు చేసిన నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచిపోయి ఏమీ తెలియనట్టు నటిస్తున్నారని ,ఏటా కరువుతో రైతులు, రైతాంగం తీవ్ర ఇబ్బందులు గురవుతుందని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతూ ప్రకృతి నిరాధారణ గురి చేస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయని పేర్కొన్నారు మండలంలో ప్రతి ఎకరాకు నీరు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హంద్రీ నీవా కు గుండ్ల కొండ దగ్గర స్లుయిజ్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా దేవనకొండ మండలంలోని చెరువుల నీటికి హంద్రీ నీవా ద్వారా నీళ్లు మళ్లించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా రెండు సంవత్సరాల కరువు నేపథ్యంలో మండలంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని మండలంలో జరిగే ప్రతిరైతు ఆత్మహత్య ప్రభుత్వ హత్యనే నని పేర్కొన్నారు.
హంద్రీనీవా నుండి స్లుయిజ్ ఏర్పాటు చేసి పై త ట్టు గ్రామాలకు సాగును ఇచ్చేవరకు మండలం లోని ప్రతి చెరువుకు నీళ్లు మళ్లించే వరకు రైతు,వ్యవసాయ కార్మిక సంఘాలు పోరాటాలు చేస్తాయని, ఉద్యమాన్ని దశలవారీగా ఉధృతం చేస్తామని పేర్కొన్నారు ప్రజలతో, రైతుల మద్దతు తో ప్రభుత్వ కార్యాల కార్యాలయం దిగ్బంధన కార్యక్రమం కూడా చేపడతామని జరగబోయే ఉద్యమాలకు ప్రభుత్వందే బాధ్యతని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మహబూబ్బాషా, సీనియర్ నాయకులు బజారి ,యువజన సంఘం నాయకులు శ్రీనివాసులు రైతు సంఘం నాయకులు సుంకన్న సుధాకర్ మార్కండేయులు దీక్షలో కూర్చున్నారు అదేవిధంగా ప్రజాసంఘాల నాయకులు యూసుఫ్ బాషా, రాయుడు, మహేంద్ర ,సింహాద్రి ,పాండు, నాగేంద్ర రమేష్, నాగేష్ లతోపాటుగా బండపల్లి గుడిమరాళ్ల ,గుండ్లకొండ రైతులు కృష్ణ, కౌలుట్ల ,ఓబయ్య బజారి తదితరులు పాల్గొన్నారు.