Andhrapradesh
పోరాటాల నేపథ్యంలోనేకరువు మండలాల ప్రకటన …..సీపీఎం
జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తీవ్రంగా కరువు నెలకొన్నదని రైతుల డిమాండ్ మేరకు కరువు మండలాల ప్రకటన పట్ల సిపిఎం పార్టీ మండల కమిటీ స్వాగతిస్తుందని, కరువు ప్రకటించాలని పోరాడిన రైతుల పోరాటానికి విజయం దక్కిందని, రైతులను ఆదుకునేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా నాయకులు బి వీరశేఖర్, మండల నాయకులు అశోక్ సూరి, యూసుఫ్ లు కోరారు.
ఈ మేరకు బుధవారం నాడు పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ మొదలైనప్పుడు నుండి అరకొర వర్షాలు పడ్డాయని ఖరీఫ్ సీజన్లో మొత్తంగా చూస్తే పట్టుమని 15 రోజులు కూడా వర్షాలు పడ్డ దాఖలు లేవని ఈ నేపథ్యంలో రైతాంగానికి తీవ్ర నష్టం జరిగిందని వారు పేర్కొన్నారు రైతులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతని ఇప్పటికే గత సంవత్సరం కరువు నుండి రైతులు కోలోకోవడం లేదని ఈ సంవత్సరం కూడా కరువుతో భారీగా అప్పుల్లో కూరుకుపోవడం జరిగిందని కావున సిపిఎం మరియు రైతు సంఘం రైతులతో కలిసి చేసిన పోరాటం విజయవంతమై అయిందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం కరువు పై నిర్దిష్టమైన చర్యలు తీసుకొని ఆదుకోవాలని వారు కోరారు రైతాంగాన్ని ఆదుకోవడం రైతుల ఉద్యమాలకు మద్దతుగా నిలవడం అందరి బాధ్యత అని, అన్నం పెట్టే రైతన్నకు అందరూ అండగా నిలబడదామని వారు పేర్కొన్నారు, కరువు పై సిపిఎం మరియు రైతు సంఘం చేసిన పోరాటాల సందర్భంగా సహకరించిన రైతులకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు, పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు అని వారు పేర్కొన్నారు, కరువు ప్రకటనే కాకుండా నిర్దిష్టమైన సహాయము, చర్యలు తీసుకునేంతవరకు పోరాటాలు నిర్వహిస్తామని అందుకు అందరూ సహకరించాలని వారు పేర్కొన్నారు