Andhrapradesh
బాబుకు మధ్యంతర బెయిల్ మంజూరుతో టిడిపి నాయకుల సంబరాలు.
బాణసంచా పేల్చి సంబరాలు జరుపుతున్న టిడిపి నాయకులు.
నంద్యాల జిల్లా రుద్రవరం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం మండల కేంద్రంలోని అమ్మవారి శాల నాలుగు రోడ్ల కూడలిలో నంద్యాల జిల్లా టిడిపి ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కొమ్మలపాటి రాజారావు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలస్యమైన న్యాయమే గెలిచిందన్నారు. సుప్రీం కోర్టులో కూడా చంద్రబాబు కు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ జెడ్పిటిసి లింగం వెంకట రంగనాయకులు, జంగా వెంకటేష్ రెడ్డి, జంగా సుదర్శన్ రెడ్డి, అల్లడి శేఖర్, రాజశేఖర్ రెడ్డి, డిష్ వెంకటసుబ్బయ్య, గంతి శ్రీనివాసులు, సురేష్, చిన్న కంబలూరు శ్రీనివాసులు మజ్జిగ చంద్ర , ప్రహ్లాదుడు గౌడు, సుబ్బయ్య గౌడు, దస్తగిరి ,నాగయ్య, హుస్సేనయ్య ,పౌలు, చిటికెల ప్రసాద్, స్వామి దాసు , తదితర టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు