Andhrapradesh
జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి:JAAP
ఆదోని నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న ప్రతి వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని జర్నలిస్ట్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ ( జాప్ ) జిల్లా సహాయ కార్యదర్శి మందుల వెంకటేష్,ఆదోని డివిజన్ జాప్ కమిటీ నాయకులు లీగల్ అడ్వైజర్ సాయికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఎమ్మార్వో వెంకటలక్ష్మి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారది గా ఉన్న జర్నలిస్టు లకు ఇంటి స్థలాలను ఇవ్వాలని అందుకు ఎలాంటి నిబంధనలు లేకుండా అక్రిడేషన్ తో సంబంధం లేకుండా ఇంటి స్థలాలు కేటాయించలని వారు కోరారు.స్పందించిన తహసిల్దార్ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) జిల్లా సహాయ కార్యదర్శి మందుల వెంకటేష్ , సీనియర్ జర్నలిస్ట్ లీగల్ అడ్వైజర్ సాయి కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రకాష్ ,మరియు జర్నలిస్టులు గౌస్,చంద్ర శేఖర్, గోపాల్ రెడ్డి,ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.