Andhrapradesh
కప్పట్రాళ్లలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
దేవనకొండ మండల పరిధిలో కప్పట్రాళ్ల గ్రామంలో వాల్మీకి గుడి నందు వాల్మీకి జయంతి వేడుకలను వాల్మీకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వి ఆర్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, వైసీపీ మండల కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జున మాట్లాడుతూ ఆది కవి వాల్మీకి మహర్షి పేరు రత్నాకరుడు అని రామాయణం రచించి ఈ దేశానికి కుటుంబం అంటే ఏమిటి అన్నదమ్ముల అనుబంధం భార్యాభర్తల అనుబంధం తల్లిదండ్రులను గౌరవించడం ఇలాంటి మంచి సందేశాన్ని ఈ దేశానికి ఇవ్వడం చాలా గర్వకారణం అని వాల్మీకి మహర్షి అందరివాడని మహర్షిని కులమతాలకు అతీతంగా పూజిస్తున్నారని ఆయన సూచించిన బాటలో వాల్మీకులంతా పిల్లలని మంచి చదువు చదివించి ఎలాంటి ఘర్షణకు వెళ్లకుండా శాంతియుత మార్గంలో జీవించి పదిమందికి ఆదర్శంగా ఉండాలన్నారు అదేవిధంగా వాల్మీకుల చిరకాల కోరిక అయినటువంటి ఎస్టి రిజర్వేషన్ పునరుద్ధరణ కొరకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని కేంద్ర ప్రభుత్వం వెంటనే వాల్మీకుల ఎస్టి రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించి వాల్మీకులకు చట్టబద్ధత కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించారు ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు చింతమాను మద్దిలేటి, దివాకర్ నాయుడు, ఎల్లబోయే సుంకన్న, తలారి చింపిరిరన్న, గొర్ల సుంకన్న, సురేంద్ర నాయుడు, సుధాకర్, పుల్లయ్య, రాజు, మల్లికార్జున, వీరేంద్ర మరియు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు