Andhrapradesh
జగన్ సర్కారు పై మండిపడిన టిడిపి నేతలు – ఏ మొహం పెట్టుకొని బస్సు యాత్ర చేస్తున్నారు.
చంద్రబాబు సర్కారు తెచ్చిన పథకాలను రద్దు చేయడం అన్యాయం.
సామాజిక న్యాయం పేరుతో మరోసారి మోసం చేయడానికి కుట్ర.
సామాజిక న్యాయం పేరుతో బస్సు యాత్ర చేపట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మరోసారి మోసం చేయడానికి జగన్ సర్కారు కుట్ర పన్నిందని, మోసపోయే స్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరని టిడిపి నేతలు పేర్కొన్నారు.
మాజీ కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం స్థానిక కోట్ల క్యాంపు కార్యాలయం నందు టిడిపి నేతలు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.చంద్రబాబు నాయుడు తన హాయంలో తెచ్చిన 27 దళిత సంక్షేమ పథకాలను రద్దు చేయడమే కాకుండా, 50వేల బ్యాక్ లక్ పోస్టులను భర్తీ చేయలేదన్నారు, 15 దళిత నియోజకవర్గాల మధ్య ఉన్న అమరావతిలో దళిత రాజధానిని నీరుగార్చారని మండిపడ్డారు.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు లబ్ధి చేకూరే విదేశీ విద్య, విద్యోన్నతి, బెస్ట్ అవైలబుల్స్ స్కూళ్లు, కళ్యాణ కానుక, కులాంతర వివాహాల ప్రోత్సాహకాలను రద్దు చేసిన ఘనుడు జగన్ అని పేర్కొన్నారు, చంద్రబాబు నాయుడు తన హాయంలో స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం అమలు చేస్తే దానిని 24% కుదించి 16,800 మంది బీసీ లను స్థానిక సంస్థలలో అధికారానికి దూరం చేశారని ఆవేదన చెందారు.9224 మందికి చంద్రబాబు నాయుడు సివిల్ కోచింగ్ ఇస్తే దానిని జగన్ రద్దుచేసి బీసీలను ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా కుట్ర పన్నాడని మండిపడ్డారు.
టీటీడీ, ఏపీఐసీసీ, చూడావంటే కీలక పదవులు బీసీలకు చంద్రబాబు కట్టబెడితే జగన్ మాత్రం బీసీలను రాజకీయంగా అనగదొక్కేలా కుర్చీ లేని ఖర్చు లేని, నిధులు గదులు విధులు లేని కార్పొరేషన్ పదవులు కట్టబడ్డారని పేర్కొన్నారు. ముస్లిం ఓట్లతో అధిక సీట్లు సాధించిన జగన్ ఇస్లామిక్ బ్యాంకు తెస్తానని హామీ ఇచ్చి నేడు ఆ ఊసే ఎత్తకుండా ముస్లిం పేదలకు ఉపయోగపడే దుల్హన్ పథకానికి మంగళం పాడారని దుయ్యపడ్డారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దమనకాండ కు పాల్పడిన జగన్ సర్కారు ఎన్నికలు సమీపిస్తుండడంతో సామాజిక న్యాయ బస్సు యాత్ర అంటూ జోల పాట పాడుతున్నారని ఎన్ని యాత్రలు చేపట్టిన, ఎన్ని కుట్రలకు పాల్పడిన జగను నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని ఎన్నికలు ఎప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తధ్యమని తెలిపారు.
నిజం గెలవాలి అని చంద్రబాబు అక్రమ అరెస్టుకు ఆగిన గుండెలు కుటుంబాలను ఓదార్చడానికి చేపట్టిన భువనేశ్వరి యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి. అల్తాఫ్, ఆం.ప్ర.రాష్ట్ర సగర ( ఉప్పర) ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ ఉప్పర ఆంజనేయులు, మాజీ ఆత్మ చైర్మన్ కందనాతి శ్రీనివాసులు, నందవరం మండలం టిడిపి నాయకులు టిడిపి ముగతి వీరారెడ్డి, ఎమ్మిగనూరు మండలం నాయకులు మాసు మాన్ దొడ్డి బోయ శ్రీనివాసులు, తెలుగు మహిళా నాయకురాలు గోకారమ్మ, టిడిపి ముస్లిం మైనార్టీ నాయకులు కె.యం.డి. అబ్దుల్ జబ్బర్, గోరా భాష, మేటి వల్లి భాష, ఆఫ్గాన్ వలిభాష, టిడిపి ఎస్సీ నాయకులు యస్. సాల్మన్, జాలవాడి ఏసన్న తదితరులు పాల్గొన్నారు.