Andhrapradesh
సంక్షేమంలో రాజకీయాలకు తావులేదు: ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
రాజకీయాలతో సంబంధం లేకుండా కుల, మత వర్గాలనే భేదం చూపకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ నవరత్నాలు పథకాలను అందిస్తున్నామని, అదే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకత అని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని కె. బొల్లవరం గ్రామంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పర్యటించారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరించి బుక్‌లెట్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. సచివాలయ, కార్యక్రమంలోవలంటర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
ప్రజలు చెప్పిన పలు సమస్యలను ఎమ్మెల్యే ఓపికగా విని నోట్ చేసుకుని, సంబంధిత శాఖాధికారులతో అక్కడికక్కడే మాట్లాడారు.తొలుత భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.కార్యక్రమంలో జడ్పీటీసీ ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ నాగమద్దమ్మ, వైస్ ఎంపీపీ కాలు నాయక్ ,సర్పంచులు, ఎంపిటిసిలు,వైఎస్సార్ సీపీ నాయకులు,కార్యకర్తలు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.