Andhrapradesh
తాడిపత్రి పట్టణంలో వాల్మీకి మహర్షి క్యాంస విగ్రహ ప్రతిష్ఠిలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం..
వాల్మీకులకు రాజకీయంగా పెద్దపీట వేసింది ముఖ్యమంత్రి జగనన్న
వాల్మీకులకు మంచిచేసే వారిని గుండెల్లో పెట్టుకొంటాం..
బీసీలను బ్యాక్ బోన్ క్లాసులుగా తీర్చిదిద్దినది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
వాల్మీకులకు రాజకీయంగా పెద్దపీట వేసింది ముఖ్యమంత్రి జగనన్ననని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం కేంద్రంలోని యల్లనూరు రోడ్డు సర్కిల్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సీతా రామ సమేత శ్రీ వాల్మీకి మహర్షి నూతన కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన సభలో మంత్రి జయరాం మాట్లాడుతూ ఒక బోయ కుల మంత్రినైనా నాకు విగ్రహ ఆవిష్కరణ నా చేతుల మీదుగా జరిగినందుకు, నేను బోయ కులంలో పుట్టినందున గర్వపడుతున్నానరు.
ప్రతి వాల్మీకి విద్యావంతులై రాజకీయంగా ఎదగాలని కోరారు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు బ్యాక్ బోన్ క్లాసులుగా తీర్చిదిద్దినది జగనన్నే బీసీ కులాలను రాజకీయంగా అధిక ప్రాధాన్యతనిస్తూ బీసీ కులాల సంక్షేమం కొరకు కృషి చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి వాల్మీకులకు మంచిచేసే వారిని గుండెల్లో పెట్టుకొంటాం అని మంత్రి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు డా”తలారి రంగయ్య, స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య,రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ ఛైర్మన్ పొగాకు రామచంద్ర,ADCC బ్యాంకు ఛైర్మన్ లిఖిత,మాజీ ఛైర్మన్ వీరా,మంత్రి సోదరులు గుమ్మనూరు శ్రీనివాసులు, గుమ్మనూరు నారాయణ స్వామి,గుమ్మనూరు ఈశ్వర్,వాల్మీకి సంక్షేమ సంఘం నాయకులు ఈశ్వరయ్య,వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ సజ్జలదిన్నే రాజు,తదితర వాల్మీకి సంఘం నాయకులు,తదితరులు పాల్గొన్నారు.