Andhrapradesh
ఇచ్చిన హామీల నెరవేర్చలేని సీఎం జగన్ ఎమ్మిగనూర్ పర్యటనను అడ్డుకుంటాం.
ప్రభుత్వ విద్యాసంస్థను నాశనం చేసిన సీఎం…
పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు బి.రామకృష్ణ
కర్నూలు జిల్లా కు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సిఎం జగన్ ఏ మొఖం పెట్టుకొని ఎమ్మిగనూరుకు వస్తున్నారని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు బి. రామకృష్ణ అన్నారు. బుధవారం ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక కార్యాలయంలో నందు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్య వ్యవస్థను నాశనం చేస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఏజెంట్ గా మారిన రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని వారు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ని నిరుద్యోగి గా మార్చి నిరుద్యోగ ద్రోహిగా మారాడని సీఎం జగన్మోహన్ రెడ్డి కారణమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నాడు నేడు పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని దానిపై విచారణ జరపాలని అన్నారు.
అలాగే పెండింగ్లో ఉన్న అమ్మ ఒడి,జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని కోరారు. వైద్య విద్యను అమ్మకానికి పెట్టినటువంటి జీవో నెంబర్ 108ను తక్షణమే రద్దు చేయాలని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు మేస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచి సొంత భవనాలు నిర్మించాలని వివరించారు. రాయలసీమలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని, కర్నూలు జిల్లాలో గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం తక్షణమే చేపట్టాలని స్పష్టం చేశారు. అలాగే ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని పత్తికొండలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, డోన్ లో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమస్యలు పరిష్కారం కై సీఎం పర్యటనను అడ్డుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు నాయకులు.కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.