Andhrapradesh
ఆంధ్ర ప్రగతి ఘర్ కే. సి. సి.అభియాన్ వారోత్సవాలు.
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పాట్రాల్ల ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మాధాపురం లో జరిగిన కళాజాత కార్యక్రమములో భాగంగా బ్యాంక్ మేనేజర్ బాలాజీ నాయక్ మాట్లాడుతూ ప్రతి రైతు కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని అన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ లబ్ధిదారులు కచ్చితంగా పంట రుణాలు గాని పాడిపశువు పోషణ రుణాలు అర్హులైన వారందరికీ అందిస్తామని ఆయన తెలిపారు ముఖ్యంగా ప్రధానమంత్రి జీవనజ్యోతి యోజన సమృద్ధి యోజన ఏపీ వై పథకాల ద్వారా మరణం కానీ ప్రమాదం కానీ జరిగినప్పుడు బ్యాంకు ను సంప్రదించి బీమా పొందవచ్చు అన్నారు. అక్షరాస్యత లేనివారికి డిజిటల్ లావాదేవీల గురించి క్షుణ్ణంగా వివరించారు ఏటీఎం పిన్ నెంబర్ మొబైల్ బ్యాంక్ లావాదేవీలు నెట్ బ్యాంక్ ఆధార్ సేవలు తెలియని వారు ఎవరినా ఫోన్ చేస్తే OTP నెంబర్ చెప్పవద్దన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ క్యాషియర్ సిద్ధప్ప, బ్యాంకు రాముడు, బ్యాంక్ మిత్ర రసూల్ దివాకర్ నాయుడు పాల్గొన్నారు.