Andhrapradesh
17, 50 లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మాణం.రోడ్డు పనులను చేయిస్తున్న బైరి బ్రహ్మం తదితరులు.
రుద్రవరం మండల కేంద్రం మేజర్ పంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో రూ,17.50 లక్షల గడపగడపకు నిధులతో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు సర్పంచ్ బైరి విజయలక్ష్మి, వైసిపి నాయకుడు బైరి బ్రహ్మం తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి సహకారంతో గడపగడపకు నిధులను కేటాయించి గ్రామంలోని ప్రధాన రహదారిలో ఎన్నో సంవత్సరాల నుంచి గుంతల మయంగా ఉన్న రోడ్డును 140 మీటర్ల పొడవున సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే తువ్వపల్లి తిప్పపై ఉన్న మోడల్ స్కూల్, విద్యుత్ సబ్ స్టేషన్ కు వెళ్లే సిబ్బంది, విద్యార్థు లకు వెళ్లడానికి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. వాహనాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులువుగా వెళ్లడానికి సిసి రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. రోడ్డు నిర్మాణం జరుగుతున్న కారణంగా తువ్వపల్లి నుంచి రెడ్డిపల్లి మీదుగా ప్రాంతాలకు వెళ్లే గ్రామస్తులు, అలాగే రెడ్డిపల్లె గ్రామ ప్రజలు సహకరించి రోడ్డు నిర్మాణం పూర్తి వరకు సహకారం అందించాలని వారు కోరారు.