Andhrapradesh
జగనన్న ఆరోగ్య సురక్ష పేదప్రజలకు శ్రీరామ రక్ష.
వైద్య శిబిరంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ ను పరిశీలిస్తున్న డి ఎల్ డి ఓ జనార్ధన రావు. హౌసింగ్ పీడీ వెంకటసుబ్బయ్య.
రుద్రవరం మండల పరిధిలోని కోటకొండ గ్రామంలోని ఎంపి యు పి స్కూల్ నందు ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎంపీడీవో మధుసూదన్ రెడ్డి, తాహసిల్దార్ రవీంద్ర ప్రసాద్, డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలందరికీ ఒక రక్షణ అని అన్నారు. బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటకొండ, కొత్తూరు, చెంచుగూడెం గ్రామాలలోని ప్రజలకు బిపి, షుగరు, ఈసీజీ, కంటి వైద్యం వంటి పలు రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టాస్క్ ఫోర్స్ సభ్యులైన డి ఎల్ డి ఓ జనార్ధన రావు, హౌసింగ్ పీడీ వెంకటసుబ్బయ్య, వైద్య స్టాల్స్ ను మరియు ప్రత్యేకంగా అంగన్వాడి సిబ్బంది ఏర్పాటు చేసినటువంటి చిరుధాన్యాల పోషక విలువలు కలిగినటువంటి తయారుచేసిన ఆహార పదార్థాలను ఆయన పరిశీలించి వాటిని తినటం వలన గర్భవతులకు, బాలింతలకు కలిగే ప్రయోజనాల గురించి తెలియపరిచారు. ఈ వైద్య శిబిరంలో పంచాయతీ సెక్రటరీ షాహినూర్, సర్పంచ్ డేగాని వెంకటేష్, ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది, ఆశ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.