Andhrapradesh
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పూర్తి…జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పర్యటన నిమిత్తం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన తెలిపారు.బుధవారం ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక పై ముఖ్యమంత్రి గారి పర్యటన ఏర్పాట్ల పై బిసీ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.అనంత రాము, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్నకేశవ రెడ్డి, సీఎం సెక్యూరిటీ అధికారులు, ఇతర అధికారులతో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదిన ముఖ్యమంత్రి ఎమ్మిగనూరులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగనన్న చేదోడు లబ్దిదారులకు నాలుగవ విడత నిధులను వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు..ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు.కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.