Andhrapradesh
చట్టసభల్లో దూదేకులకు ప్రాధాన్యత కల్పించాలి.
29 న జరిగే సింహ గర్జన జయప్రదం చేయండి.
సింహ గర్జన గోడపత్రికలు విడుదల చేస్తున్న నాయకులు.
జనాభా దామాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు దూదేకుల కులానికి చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, అధికారంలో భాగస్వామ్యం ఇవ్వాలని, ఏ రాజకీయ పార్టీ తమకు ప్రాధాన్యత కల్పిస్తుందో వారికి పూర్తి సహకారం మద్దతు ఇస్తామని నూర్ భాషా దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షులు మహబూబ్ బాషా, రాష్ట్ర గౌరవ సలహాదారుడు సాయిబాబా, రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్షావలి అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దేవనకొండ రెయిన్బో ప్రవేట్ పాఠశాల ఆవరణలో ఆ సంఘం సీనియర్ నాయకులు మాలిక్ అధ్యక్షతన మండల స్థాయి దూదేకుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై గుంటూరు పట్టణంలో ఈనెల 29వ తేదీన జరిగే దూదేకుల సింహ గర్జన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అన్ని రంగాలలో వెనుకబడిన దూదేకుల ప్రజల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. హక్కుల సాధన కోసం ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఉద్యమించేలా సంఘటితం కావాలన్నారు. మైనార్టీ పదవులలో వర్గీకరణ, దామాషా ప్రకారం పదవులు, బడ్జెట్ తప్పనిసరిగా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దూదేకుల సంఘం రాష్ట్ర నాయకులు ఇమామ్ కాసిం, ఆలూరు తాలూకా అధ్యక్షులు శాలి సాహెబ్, ఆదోని డివిజన్ నాయకులు అబ్దుల్, మన్సూర్, ఆనవాలు మాబు సాబ్, స్థానిక నాయకులు రసూల్, అల్లిపీరా, సుభాన్, చాంద్, రాజా సాబ్, రెహమాన్, యాహియా వలి, హోటల్ కాశీం, భాష పాల్గొన్నారు.