Andhrapradesh
కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ముఖ్యమంత్రికి సిపిఐ బహిరంగలేఖ.. కరపత్రాల పంపిణీ, విస్తృత ప్రచారం.
కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. సిపిఐ
సిపిఐ ఆధ్వర్యంలో దేవనకొండలో కరపత్రాల పంపిణీ, విస్తృత ప్రచారం.
కర్నూలు జిల్లాను కర్నూలు జిల్లాగా ప్రకటించి, కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ కరపత్రాలు పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారం చేయడం జరిగిందని సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి ఎమ్.నరసరావు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం దేవనకొండ మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలోనే అత్యంత కరువు జిల్లాగా పేరుగాంచిందన్నారు.జిల్లాలో పశ్చిమ ప్రాంతం నియోజకవర్గాలు వర్షాలు లేక కరువు కాటకాలకు నిలయంగా మారాయన్నారు.కరువు విలయతాండవం చేస్తున్నదన్నారు. ఈ ప్రాంతం ప్రజలు కనీసం తాగునీటి సైతం దొరకక అలమటిస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈనెల 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని, పత్తి,వేరుశనగ, కంది, జొన్న, సజ్జ, కొర్ర,ఆముదము వంటి పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 50వేల రూపాయలు, ఉల్లి, మిర్చి, ఉద్యానవన పంటలకు ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, రైతులు బ్యాంకులలో తీసుకున్నటువంటి రుణాలను రద్దు చేయాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రజలు వలస పోకుండా అన్ని గ్రామాల్లో పనులు కల్పించి పని దినాలు 200 రోజులకు పెంచాలని, ఆర్డీఎస్ కుడి కాలువ, వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించి పూర్తి చేయాలని, ఎల్ ఎల్ సి, హంద్రీ-నీవా కాల్వ కింద పంటలు సాగు చేస్తున్న రైతులకు జనవరి 15 వరకు సాగునీరు అందించి పంటలు కాపాడాలని, జిల్లా అభివృద్ధి కొరకు పదివేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ని డిమాండ్ చేస్తూ బహిరంగ లేక రాయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి స్పందించకపోతే రాబోయే రోజుల్లో రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు సుల్తాన్, రామాంజనేయులు, మహబూబ్ బాషా,రవి, వెంకట్ రాముడు, మిన్నళ్ల రైతులు పాల్గొన్నారు.