Andhrapradesh
వైసిపి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం… ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి.
నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 34 వార్డు బీసీ కాలనీలో 157 రోజు వార్డు ఇన్చార్జి జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలోగడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే గడప గడప తిరుగుతూ లబ్ధిదారులతో మమేకమై అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ జగనన్న ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి వారికి సంక్షేమ పథకాల కరపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప రవిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి ఇంటింటా విశేష ఆదరణ లభిస్తుందని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి సమాచారంతో బుక్‌లెట్స్‌తో లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి వివరించడం జరుగుతుందని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో కష్టాలు తీరిన ఆనందం ప్రజల్లో కనిపిస్తోందని నియోజకవర్గంలో వైసిపి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాబోవు కాలంలో మరింత మెరుగైన పాలన అందించేందుకు పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా, రాష్ట్ర దృశ్యకలాల డైరెక్టర్ సునీత అమృతరాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ లు గంగిశెట్టి శ్రీధర్, పంషావలి, నంద్యాల ఒకటో పట్టణ అధ్యక్షుడు పున్నా శేషయ్య ,మున్సిపల్ కౌన్సిలర్లు శాదిక్, కలాం భాష ,చంద్రశేఖర్, తబ్రీజ్ ,సమ్మద్, కోఆప్షన్ సభ్యులు సలాం ముల్లా, సచివాలయ కన్వీనర్ దాల్మిల్ అమీర్, వైసీపీ నాయకులు లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్ ,సోమశేఖర్ రెడ్డి, టీవీ రమణ, దేవనగర్ భాష, అమృతరాజ్ ,రహమతుల్లా, వార్డు వైసిపి నాయకు పులి ప్రకాష్ ,రవి, రంగస్వామి, షాకు బాయ్, ఎగ్బాల్, దస్తగిరి, షబ్బీర్ ,ఆలీషా, పెద్దన్న, సుధాకర్ ,మా భాష(మెరిభా) కృష్ణారెడ్డి, శివాజీ, గడ్డం వలి, సుధాకర్ మరియు మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు