Andhrapradesh
స్వరూపానందను కలిసిన విశాఖ సీపీ రవిశంకర్.
88 Views
విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ మంగళవారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్నారు. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసారు. పోలీస్ కమిషనర్ రవిశంకర్ బాధ్యతలు చేపట్టిన అనంతరం పీఠాన్ని దర్శించుకోవడం ఇదే మొదటిసారి. స్వరూపానందేంద్ర స్వామితో శరన్నవరాత్రి ఉత్సవాల గురించి అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ వెంట డిప్యూటీ పోలీస్ కమిషనర్లు శ్రీనివాసరావు, ఆనంద రెడ్డి, ఏసీపీ నర్శింహమూర్తి తదితరులు స్వరూపానందేంద్రను కలిసిన వారిలో ఉన్నారు.