Andhrapradesh
చంద్రబాబు నాయుడు పై అక్రమ అరెస్టును ఖండిస్తూ మేము సైతం అంటూ శాంతియుత ర్యాలీ.
తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు,నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా తెలుగుదేశంపార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు కర్నూలు మరియు నంద్యాల జిల్లాల అధ్యక్షులు బి.టి.నాయుడు మరియు శ్రీ మల్లెల రాజశేఖర్ అధ్వర్యంలొ కర్నూలు నగరం నందు సంఘీభావ శాంతియుత ర్యాలి నిర్వహించారు.
కార్యక్రమం నందు కర్నూలు, నంద్యాల జిల్లాల పార్టీ ఇంచార్జి వైకుంఠం ప్రభాకర్ చౌదరి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నియోజకవర్గం పార్టీ ఇంచార్జీలు భూమా అఖిల ప్రియ (ఆళగడ్డ), బుడ్డా రాజశేఖర రెడ్డి (శ్రీశైలం), గౌరు వెంకట రెడ్డి (నందికోట్కూరు కోఆర్డినేటర్), టి.జి.భరత్ (కర్నూలు), గౌరు చరితా రెడ్డి (పాణ్యం), భూమా బ్రహ్మానంద రెడ్డి (నంద్యాల), బి.సి.జనార్ధన్ రెడ్డి (బనగానపల్లె), మన్నె సుబ్బా రెడ్డి (డోన్), కె.ఇ.శ్యాం బాబు (పత్తికొండ), ఆకేపోగు ప్రభాకర్ (కోడుమూరు), బి.వి.జయనాగేశ్వర రెడ్డి (ఎమ్మిగనూరు), పి.తిక్కా రెడ్డి (మంత్రాలయం), కె.మీనాక్షి నాయుడు (ఆదోని), రాష్ట్ర పార్టీ నాయకులు వై.నాగేశ్వర రావు యాదవ్, నంద్యాల నాగేంద్ర, పోతురాజు రవికుమార్, సోమిశెట్టి నవీన్, కె.బశీర్ అహ్మద్, కురువ పరమేశ్, రాజు యాదవ్, మహేశ్ గౌడ్, రమాకాంత్ రెడ్డి, సంజీవ లక్ష్మి, ఎ.వై.ఎన్.బాబు రాజ్, అయ్యన్న మొదలగు వారితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.