Andhrapradesh
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా క్షేత్ర గుడి ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు
ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆలూరు తాలూక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ హాలహర్వి మండల పరిదిలోని క్షేత్రగుడి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి 101 టెంకాయలు కొట్టి నినాదాలు ఇస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం వల్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నారు.మాకెప్పుడు మంచి రోజులు వస్తాయి అని ఎదురు చూ స్తున్నారు కష్టాలు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భరోసా ఇస్తూ భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో సూపర్ సిక్స్ పథకాలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు అన్నారు చంద్రన్న పాలన మళ్లీ వస్తేనే తమ జీవితాలు వెలుగులు నిండుతాయని ప్రజలు కూడా భావిస్తున్నారు అని తెలియజేశారు.నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా నిర్బందించిన నేపథ్యంలో బాబుగారు ఆయురారోగ్యాలతో త్వరగా విడుదల కావాలని పూజలు నిర్వహించమన్నారు.ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, పచ్ఛారపల్లి ప్రహ్లాద రెడ్డి, అర్థగేరి రఘు ప్రసాద్ రెడ్డి, కృష్ణం నాయుడు, వెంకటేశ్వర్ రెడ్డి, కోమరి , హాలహర్వి సర్పంచ్ మల్లికార్జున, నరసప్ప ,గూళ్యం ఎల్లప్ప ,వీరేష్ , కార్యకర్తలు,యూత్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.