Andhrapradesh
కొనసాగుతున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.
ఈ రోజు పరవాడ మండలం రావాడ పంచాయతీ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌ౹౹శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రావాడ పంచాయతీ లో ప్రారంభమైంది., గ్రామానికి విచ్చేసిన సందర్భంగా పరవాడ మండల వైస్ ఎంపీపీ బంధం నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు కోన రామారావు స్వాగతం పలికారు.., ప్రతి గడపకు వెళ్లి వారికి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుండి అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని వివరిస్తూ ప్రతి అవ్వకు ప్రతి అక్కకు చెల్లెమ్మలకు ఉన్న కష్టాలను తెలుసుకోవడం జరిగింది. ఇంట్లో పెద్దవాళ్లకు, వితంతువలు,వికలాంగులకు పెన్షను, ఇంటింటికి రేషన్ బియ్యం పథకం, మహిళామణులకు ఆర్థికాభివృద్ధి, రైతన్నలకు రైతు భరోసా, పిల్లలకు నాణ్యమైన చదువులు, నవరత్నాలు పేదలందరికీ సొంతిల్లు, డ్వాక్రా రుణాలు, నవరత్నాలు ఇలా ఎన్నింటినో ప్రజలకు అందిస్తూ జగనన్న మనకు అండగా ఉన్నాడని అన్నారు. రావాడ పంచాయతీ పరిధిలో జగనన్న ముఖ్యమంత్రి అయినప్పటి నుండి మన ప్రభుత్వం నుండి 31 కోట్ల 34 లక్షల రూపాయలు సంక్షేమ పథకాలు ద్వారా ప్రజలకు అందించడం జరిగిందని తెలిపారు. జగనన్న రాసిన లేఖను చూపిస్తూ నాలుగేళ్ళ లో ఆ కుటుంబానికి జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందిన తీరును వివరించారు. ఎమ్మెల్యే గారు ప్రతి కుటుంబంతో మాట్లాడుతూ ఇప్పుడు జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై అభిప్రాయం చెప్పమని కోరారు. దాంతో ఆ కుటుంబమంతా ఎంతో సంతోషంగా జగనన్న చల్లగా ఉండాలని దీవించారు. ఈ రోజున ముఖ్యమంత్రి మన జగనన్న కావడం వల్లే మా జీవితాలు బాగుపడ్డాయని, మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలని హర్షాతిరేకాల తో ఆనందంగా తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర CEC సభ్యులు పైల శ్రీనివాసరావు , పరవాడ జడ్పీటీసీ పైల సన్యాసిరాజు మాజీ RECS చైర్మన్ చల్ల కనకరావు, పెందుర్తి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పైల అప్పల నాయుడు, వై.సి.పి నాయకులు కావలి రాజు, అప్పలరాజు, కావలి వాసు, బొద్దపు చిన్నారవు, అశోక్, పల్లా గోవింద్, గంగరాజు, పరవాడ ఎంపీడీఓ హేమ సుందరరావు, EORD రమేష్ నాయుడు, PR AE గండి రామారావు, హోసింగ్ AE రెడ్డి గారు, RWS AE షణ్ముఖ, RECS AE శేష సాయి, APM కనకమ్మ, అగ్రికల్చర్ AO చంద్రవతి, VRO బుజంగ రావు, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్ లు తదితరులు పాల్గొన్నారు.