Andhrapradesh

జగన్ రెడ్డి వైఖరితో రాష్ట్రానికి భారీగా నష్టం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

Published

on

78 Views

కృష్ణా జలాల అంశంపై కడపలో జరగననున్న అఖిలపక్ష సదస్సుకు సంబంధించిన పోస్టర్ల ఆవిష్కరణ సందర్భంగా మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృష్ణా జలాల పున:పంపిణీ అంశంపై రేపు సీపీఐ ఆధ్వర్యంలో కడప జిల్లాలో అఖిలపక్ష సదస్సు జరగనుంది బచావత్ ట్రిబ్యునల్ నిర్ణయం ప్రకారం ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయించివున్నారు.రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 512 టీఎంసీలు ఏపీకి కేటాయించారు. ఈ కేటాయింపులపై పున:సమీక్ష జరపాలని తెలంగాణ ప్రభుత్వం కోరడం, కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది సీఎం జగన్ రెడ్డి తన అక్రమాస్తులు, కేసుల నేపథ్యంలో రాష్ట్ర హక్కుల గురించి నోరు విప్పడానికే వణికిపోతున్నారు.జగన్ రెడ్డి అవలంభిస్తున్న వైఖరితో ఏపీకి ప్రధానంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు భారీగా నష్టపోతున్నాయి. రైతులు, రైతు సంఘాల నేతలు, మేధావులు రాజకీయాలకు అతీతంగా కడప సదస్సులో పాల్గొనాల్సిన అవసరం ఉంది కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి షానవాజ్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి, సయ్యద్ సిరాజ్, గోపాల్, మున్నా తదితరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version