Andhrapradesh
జగనన్న ప్రభుత్వంలో అన్నివర్గాలకు మేలు స్థానికులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్…
గడపగడప కు మన ప్రభుత్వం కార్యక్రమం లో కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్.
జగనన్న ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు చేకూరుతోందని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం 47వ వార్డు ధర్మపేట్,గిప్సన్ కాలనీ లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల మంజూరు, చేకూరిన లబ్ధినివివరించి సంక్షేమ బుక్లెట్లను అందజేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల బతుకులు మార్చాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన అనేక సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ మేలు జరుగుతోందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని తరహాలో పాలన సాగిస్తున్న జగనన్నను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక వార్డ్ కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ యన్. అరుణ,రైల్వే ప్రసాద్, భారతి,సుధాకర్, సందీప్,లక్ష్మణ్, లాజర్,బాషా ,నాగరాజ్,నజీర్ ,అబ్దుల్లా , ఏసు,కిరణ్ ,ఇమ్మి ,స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు ఇంకా నియోజకవర్గ పరిధిలోని పలువురు నాయకులు,కార్యకర్తలు,సచివాలయ సిబ్బంది,మున్సిపాలిటీ సిబ్బంది, ఆర్.పి లు సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.