రుద్రవరం మండల పరిధిలోని కోటకొండ గ్రామంలో వైయస్సార్ బీమా పథకం కింద రూ పదివేల రూపాయల ఆర్థిక సహాయం మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ డే గాని వెంకటేష్, కార్యదర్శి షాహినూర్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన తిరుమలేష్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడన్నారు. అతని అంత్యక్రియల నిమిత్తము తక్షణ సహాయం కింద రూ 10,వేల ఆర్థిక సహాయాన్ని మృతుడు భార్య సుమలతకు అందజేయడం జరిగిందన్నారు. ఈ పథకం కింద బాధిత కుటుంబానికి అందవలసిన రూ1 లక్ష రూపాయలలో తక్షణ సహాయం కింద 10, వేల రూపాయలు అందజేశామని మిగిలిన రూ 90 వేల రూపాయలను మృతుని భార్య సుమలత బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఆర్థిక సహాయం అందజేసిన వారిలో వెల్ఫేర్ అసిస్టెంట్ పార్థసారథి, వాలంటీర్ షేక్ షాహిన్ పాల్గొన్నారు.