Andhrapradesh
జిల్లాలో విద్యా సమస్యలపై సీఎం స్పందించాలి. పీడీఎస్ యూ.రాష్ట్ర కార్యదర్శి రాజేశ్.
జిల్లాలో విద్యా సమస్యలపై సీఎం స్పందించాలి. పీడీఎస్ యూ.రాష్ట్ర కార్యదర్శి రాజేశ్. జిల్లాలో విద్యార్థులు ఎదుర్కోంటున్న విద్యా సమస్యలను సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిష్కరించాలి అని పీడీఎస్ యూ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్ కోరారు. ఈ సందర్భంగ మాట్లాడుతూ కర్నూల్ జిల్లా అంటేనే వలసలకు నిలయం అలాంటి జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేని ప్రాంతం కేవలం వర్షాలు మీద ఆధారపడి జీవిస్తున్నరు ఈ ప్రాంతంలో యస్సీ,బీసీ హాస్టల్ లేకపోవడం చేత నిత్యం వలసలకు వెళుతున్న క్రమంలో వారి పిల్లలను కూడా బడి పంపకుండా మధ్యలో వదిలింపజేసి వారి వెంట వలసలకు తీసుకెళ్లుతున్నరు. ముఖ్యంగా ఆడపిల్లలకు హాస్టల్ లేకపోవడం చేత చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే ప్రభుత్వ ఐటిఐ కళాశాలను నెలకొల్పాలి, పీజీ విద్యార్థులకు విద్యా దీవెన వర్తింప జేయాలి ,డీఎస్సీ నోటిఫికేషన్ ను తక్షణమే విడుదల చేయాలి, హాస్టల్ కు సొంత భవనలు నిర్మించాలి అని ఈ నెల 19న ఎమ్మిగనూర్ కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యం లో ఆయన దృష్టికి తీసుకెళ్ళతాము తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు నాయకులు విజయ్ ,అఖిల్, వినయ్,గురు, రాజు తదతరులు పాల్గొన్నారు.