Andhrapradesh
వైష్ణవీ దేవి అవతారంలో రాజశ్యామల
విశాఖ శ్రీ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. మంగళవారం మూడోరోజు రాజశ్యామల అమ్మవారు వైష్ణవీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శంఖు, చక్రాలను చేతపట్టిన వైష్ణవీ దేవి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారి అలంకారానికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు హారతులిచ్చారు. లోక కళ్యాణార్ధం విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామల యాగంలో తెలంగాణకు చెందిన రాజ్యసభ మాజీ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ దంపతులు పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య రాజశ్యామలా సమేత చంద్రమౌళీశ్వరులకు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి పీఠార్చన చేసి దివ్య హారతులు ఇచ్చారు. రాజశ్యామల అమ్మవారి సన్నిధిలో శ్రీ చక్రానికి నిర్విరామంగా ఏడు గంటలపాటు నవావరణార్చన నిర్వహించారు. పండిత రత్న డాక్టర్ ప్రభాకర కృష్ణమూర్తి ప్రవచనం ద్వారా అహల్యా శాప వృత్తాంతాన్ని వివరించారు. విశాఖకు చెందిన పి చిన్నా బృందం జగన్మాతను స్తుతిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ సురేష్, దేవాదాయ శాఖ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత్, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులు
కుంకుమ పూజలకు విశేష స్పందన
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విశాఖ శ్రీ శారదాపీఠం నిర్వహిస్తున్న సామూహిక కుంకుమార్చనకు విశేష స్పందన లభించింది. నిత్యం వందలాది మంది మహిళలు, బాలికలు కుంకుమ పూజల్లో పాల్గొంటున్నారు. పండితులు లలితా సహస్ర నామాలను చదువుతూ రాజశ్యామల యంత్రానికి పూజలు చేయిస్తున్నారు. ఏటా నవరాత్రి ఉత్సవాల్లో విశాఖ శ్రీ శారదాపీఠం సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తుంది. అమ్మవారి ప్రీతి కోసం మహిళలు ఈ పూజల్లో పాల్గొంటున్నారు.