Andhrapradesh
ఎమ్మిగనూరు లో ఈ నెల 19 న జగనన్న చేదోడు పథకం నిధులు విడుదల ముఖ్యమంత్రి సభను జయప్రదం చేయండి..
మండల కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జున
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో ఈ నెల 19 న జగనన్న చేదోడు పథకం నిధులు విడుదల చేయుచున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సభకు మండలం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ,నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తరలి వెళ్లి సభను జయప్రదం చేయాలని మండల కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జున, జడ్పిటిసి సభ్యులు రామకృష్ణ లు కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెప్పిన మాట ప్రకారం మాట తప్పకుండా నాలుగోసారి జగనన్న చేదోడు నిధులు విడుదల చేయడం జగనన్న మాట ఇస్తే మాట తప్పుడు అన్నదానికి ఇది ఒక నిదర్శనం అన్నారు. అలాగే ఎన్నో ఏళ్లుగా బీసీల కుల గణన పై ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన ఎవరు కూడా పట్టించుకోలేదని ఎన్నో ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీ ల కుల గణన పై చర్యలు తీసుకోవడం బీసీల పైన తనకున్న ప్రేమను మరొకసారి చూపించాడని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వైసిపి సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ జుబేర్ సాబ్, వైసిపి నాయకులు శంకరయ్య, హరిచంద్ర, మద్దిలేటి, శీను, భీమన్న తదితరులు పాల్గొన్నారు.