Andhrapradesh
జగనన్న ఆరోగ్య సురక్ష పేద ప్రజలకు శ్రీరామ రక్ష
కోడుమూరు నియోజకవర్గ పరిధిలో కర్నూలు మండలం నిడ్జూర్ గ్రామ సచివాలయం నందు కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ జరదొడ్డి సుధాకర్ అధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన కోడుమూరు ఎమ్మెల్యే గారికి స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఈ కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని సందర్శించి,అక్కడి వైద్యులతో మాట్లాడి,శిబిరానికి విచ్చేసిన ప్రజలకు చేస్తున్న ఆరోగ్య పరీక్షలను,అందుబాటులో ఉన్న మందులను అడిగి, తెలుసుకున్నారు.కోడుమూరు ఎమ్మెల్యే అక్కడే జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో అంగన్ వాడీ కార్యకర్తలు గ్రామాల్లోని గర్భిణీ స్త్రీలకు ఎలాంటి పౌష్ఠికాహారం ఎన్ని విధాలుగా అందిస్తున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం వారు ఉచితంగా పంపిణీ చేసిన కంటి అద్దాలను వృద్దులకు కోడుమూరు ఎమ్మెల్యే స్వయంగా వారికి తొడిగారు.ఈ కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలల్లోనే ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత మన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే అన్నారు.ఆరోగ్య శ్రీ పథకం ప్రధాత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే అదేవిధంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి మన సీఎం గారని,అందులో భాగంగా “జగనన్న ఆరోగ్య సురక్ష”,వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జగనన్న ఆరోగ్య సురక్ష.కర్నూల్ మండలం నిడ్జూరు గ్రామం ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాధవి,ఎంపీపీ శ్రీమతి వాసు వెంకటేశ్వరమ్మ ,జడ్పిటిసి ప్రసన్నకుమార్, మండల కన్వీనర్&మాజీ మార్కెట్ డైరెక్టర్ మా భాష, వైసిపి నాయకులు సత్యం రెడ్డి,సంపత్ కుమార్, మాజీ మండల ఉపాధ్యక్షులు వాసు, తిరుపతి రెడ్డి, విద్యాసాగర్ వైయస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.