RTC అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న మహిళ కండాక్టర్ శ్రీవిద్య కుటుంబాన్ని పరామర్శించినఎల్. బి నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి .
ఎల్. బి నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ కు చెందిన శ్రీవిద్య గత 13 సంవత్సరాలుగా నాగోల్ బండ్లగూడ బస్సు డిపోలో కండాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.అదే డిపోకు చెందిన ఉన్నతాధికారులు రాత్రి పగలు తేడా లేకుండా అదనంగా డ్యూటీలు వేస్తూ మానసికంగా వేధిస్తున్నారని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకొని చనిపోయిన శ్రీవిద్య కుటుంబాన్ని పరామర్శించి RTC ఉద్యోగుల ధర్నాలో పాల్గొన్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవిద్య ఆత్మహత్యకు కారకులైన ఉన్నతాధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.