Andhrapradesh

ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం.

Published

on

302 Views

భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
అభివృద్ధికి బాటలు వేద్దాం..
B.గిడ్డయ్య సీపీఐ జిల్లా కార్యదర్శి…

 

దేవనకొండ సార్వత్రిక ఎన్నికలలో బిజెపి వైసిపి టిడిపి జనసేన, పార్టీలకు చెందిన అభ్యర్థులను రాష్ట్రము నుంచి తరిమికొట్టి,ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్, సీపీఐ,సీపీఎం అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుందామని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య తెలిపారు. ఆదివారం దేవనకొండ సీపీఐ కార్యాలయంలో సీపీఐ మండల కార్యదర్శి ఎమ్.నరసరావు అధ్యక్షతన పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసంద్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య మాట్లాడుతూ ఈసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు గత ఎన్నికల కంటే భిన్నమైనవని, ప్రధానంగా కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దేశ సమైక్యత, సమగ్రత,లౌకికవాదం ప్రధానమైన హక్కులు హరించే పద్ధతులలో పరిపాలన కొనసాగిస్తున్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులమతాలను రెచ్చ గొట్టి గొడవలు సృష్టించి పరిపాలన కొనసాగిస్తున్నారని మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మెజార్టీగా ఉన్న హిందువుల ఓట్లను కొల్లగొట్టి తిరిగి అధికారం లోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని బిజెపి ప్రభుత్వానికి ఎదురు తిరిగి మాట్లాడితే ప్రజాస్వామ్యాన్ని అపహష్యం చేసే పద్ధతుల్లో సిబిఐ,ఈడి,లను పెంపుడు కుక్కల వలే వాడుకొని వ్యవస్థలను దుర్యోగం చేస్తూ, ప్రతిపక్ష పార్టీల నాయకులపై, ముఖ్యమంత్రుల పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రధానమైన ప్రభుత్వ రంగ సంస్థలైన టెలికాం ఎల్ఐసి రైల్వే చివరికి అంతరిక్ష పరిశోధన కేంద్రాలను కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారని నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం చేయలేక ప్రతి ఏడాది యువజనలకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 100 రోజులలో అధిక ధరలు తగ్గిస్తామని, ఇతర దేశాలలో ఉంటున్న నల్లధనాన్ని రప్పించి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల బ్యాంకు అకౌంట్లో జమ చేస్తానని హామీ ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి జరగబోవు ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఐదేళ్ల కాలంలో ప్రజలపై భారాలు మోపనని వాగ్దానం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన వై.ఎస్.జగన్ రెడ్డి ఏడుసార్లు కరెంటు చార్జీలు పెంచారని,నాలుగు సార్లు ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచారని,రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారని,నగరాల్లో పట్టణాల్లో ఇంటి పన్నులు,నీటి పన్నులు పెంచి కొత్తగా చెత్త పన్ను కూడా వేశారని, సంక్షేమం పేరుతో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయల ప్రజల దగ్గర నుండి గుంజుతున్నారని,రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి అవినీతి కేసుల కోసం అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు వైఎస్ జగన్ రెడ్డి,చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కాళ్ల కింద మోకరిల్లారని దీని కారణంగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని, అన్యాయం చేసిన బిజెపితో పరోక్షంగా,ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుని అంటగాగుతున్న వైసీపీ, తెలుగుదేశం,పార్టీలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, ఓడించాలని, ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్న అసెంబ్లీ,లోక్సభ అభ్యర్థులను గెలిపించాలని, దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నబి రసూల్ ,కే మద్దిలేటి శెట్టి ,డి రాజా సాహెబ్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎన్ కృష్ణయ్య, సయ్యద్, సుల్తాన్, సాహెబ్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి కృష్ణ,రైతు సంఘం మండల గౌరవ అధ్యక్షులు కండప్ప, రైతు సంఘం మండల సీనియర్ నాయకులు తిమ్మప్ప,సిపిఐ మండల నాయకులు ఈరన్న,రాజన్న, మహేశ్వరప్ప, తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version