Crime News
ప్రవల్లిక కేసు .. చిక్కడపల్లి ఇన్స్‌పెక్టర్‌పై సస్పెన్షన్ వేటుపడింది.
గ్రూప్ 2 పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోన్న విద్యార్ధిని ప్రవళిక విషయంలో చిక్కడపల్లి ఇన్స్‌పెక్టర్ నరేష్‌పై వేటు వేసింది తెలంగాణ ప్రభుత్వం . ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు నిన్న మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమ వ్యవహారమే ప్రవళిక ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చామని చెప్పారు. ఆమె ఫోన్ చాటింగ్‌లో కొంత సమాచారం లభించిందని తెలిపారు. ప్రవళిక ప్రేమ వ్యవహారం ఆమె తల్లిదండ్రులకు కూడా తెలుసునని చెప్పారు. ప్రేమించిన వ్యక్తి మోసం చేసి మరో అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంటున్నాడనే ప్రవళిక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని నిర్దారించామని తెలిపారు.
చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు రాత్రి 8.40 గంటల ప్రాంతంలో ఫోన్ కాల్ వచ్చిందని చెప్పారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లడం జరిగిందని తెలిపారు. ప్రవళిక హాస్టల్‌లో ఉన్నవారి నుంచి వివరాలు సేకరించడం జరిగిందని చెప్పారు. చిక్కడపల్లి, అశోక్ నగర్ ప్రాంతాల్లోని పెద్ద ఎత్తున విద్యార్థులు వేర్వేరు వెర్షన్లతో ధర్నాకు దిగడం జరిగిందని తెలిపారు. కొంతసేపటికే స్థానిక లీడర్లు కూడా అక్కడికి వచ్చారని చెప్పారు. అయితే వారిని తొలగించి రాత్రి 1.30 గంటల ప్రాంతంలో ప్రవళిక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం ఉదయం ప్రవళిక మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని తెలిపారు.
అయితే అమ్మాయి గదిలో సూసైడ్ నోట్, మొబైల్ ఫోన్, లవ్ సింబల్ ఉన్న మరో లేఖ లభించిందని తెలిపారు. మొబైల్ ఫోన్‌కు లాక్ లేదని.. అందులో కొంత చాటింగ్ కనిపించిందని చెప్పారు. ఈ మూడింటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్టుగా తెలిపారు. డేటా రీట్రైవ్ చేసిన తర్వాత మరింతగా సమాచారం తెలుస్తోందని అన్నారు. ఆ తర్వాత తదుపరి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.
మొబైల్ ఫోన్‌లో చాటింగ్ ఆధారంగా విచారణ జరిపితే.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కోస్గికి చెందిన శివరామ్ రాథోడ్ అనే వ్యక్తితో చాటింగ్ చేసినట్టుగా తేలిందని చెప్పారు. అలాగే బాలాజీ దర్శన్ హోటల్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రవళిక, శివరామ్ కలిసి టిఫిన్ చేసినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ లభించిందని తెలిపారు. అయితే చాటింగ్‌ను పరిశీలిస్తే.. ప్రవళికను చీట్ చేసి శివరామ్ వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ కుదుర్చుకునేందుకు చూశాడని.. అందుకే ప్రవళిక మనస్తాపం చెందిందని తెలుస్తోందని చెప్పారు.
ప్రవళిక తల్లిదండ్రులు మర్రి లింగయ్య- విజయలకు కూడా ఆమె ప్రేమ విషయం తెలుసునని.. గతంలో ఒకసారి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతంఅనుమానస్పద మృతిగా ఇప్పుడు కేసు నమోదు చేశామని.. డేటా రిట్రీవ్ అయిన తర్వాత లీగల్ ఓపినియన్ తీసుకుని 306 కిందకు కేసును మార్చనున్నట్టుగా చెప్పారు. అయితే దీని వెనక ఏ ఇతర కారణాలు కనిపించడం లేదనిఅన్నారు. గ్రూప్స్ పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యేందుకు వచ్చిందని.. ఇప్పటివరకు ఎలాంటి పరీక్ష రాయలేదని చెప్పారు. సూసైడ్ నోట్ చూస్తే క్లియర్‌గా తెలుస్తోందని.. వాళ్ల అమ్మను క్షమించమని కోరిందని, జాగ్రత్తగా చూసుకోమని తమ్ముడికి చెప్పిందని తెలిపారు.
ప్రవళిలక పర్సనల్ విషయంలోనే ఆత్మహత్య చేసుకుందని ఆమె రూమ్‌మెట్స్ కూడా చెప్పారని తెలిపారు. రాత్రి కూడా ప్రవళిక రూమ్‌మెట్ శృతి ఇదే విషయాన్ని చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. శివరామ్ ఆచూకీ ఇంకా లభించలేదని తెలిపారు. అన్ని ఆధారాలు లభించిన తర్వాత శివరామ్‌పై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిన్న ఆందోళన చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్టుగా చెప్పారు.
Andhrapradesh
పరిపూర్ణ ప్రజాస్వామ్యవాది సీతారాం ఏచూరి…… ఘనంగా సితారాం ఏచూరి కి నివాళి…
భారత దేశ రాజకీయాల్లో పరిపూర్ణ ప్రజాస్వామ్యవాది పీడిత ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ సీతారాం ఏచూరి అని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్,మాజీ విద్యార్థి సంఘం నాయకులు, మాజీ సర్పంచ్ ఉచ్చిరప్ప, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ తపాల శ్రీనివాసులు సిపిఐ మండల కార్యదర్శి నరసరావు మాజీ రైతు సంఘం నాయకులు ఉప్పర నరసప్ప లు పేర్కొన్నారు.
గురువారం నాడు దేవనకొండ మండల కేంద్రంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభ స్థానిక ముగితాత ఆవరణలో జరిగింది.
పార్టీ జిల్లా నాయకులు బి వీర శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ నాయకుడు సీతారాం ఏచూరి అని రాజకీయాలు ఏమైనా సమస్యల ప్రతిపాదికన చట్టసభల్లోను అదేవిధంగా పార్లమెంట్ బయట అణగారిన వర్గాల కోసం భారత రాజ్యాంగ విలువలు కోసం, రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం రాజ్యాంగ పరిరక్షణకై కట్టుబడి పని చేశారని పేర్కొన్నారు.
సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన దళిత గిరిజన వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పోరాడినడ వ్యక్తి సీతారాం ఏచూరి అని పేర్కొన్నారు.
వివిధ భావాలు, సిద్ధాంతాలు ఉన్న రాజకీయాల్లో అందరినీ కలుపుకొని సమస్య పరిష్కారమే లక్ష్యంగా ఉమ్మడి పోరాటం చేశారని పేర్కొన్నారు.
విద్యార్థి దశలోనే జేఎన్టీయూ నాయకుడిగా ఇందిరా గాంధీ నిలదీసి విసీ పదవికి రాజీనామా చేయించారని, విద్యార్థి నాయకుడిగా అందరికీ విద్యానదించాలనే పోరాటాన్ని దేశవ్యాప్తం చేశాడని పేర్కొన్నారు.
తదనంతర రోజుల్లో ప్రజా నాయకుడిగా తిరుగులేని నేతగా ఎదిగాడని భారతదేశ మౌలిక పరిస్థితులు సాంప్రదాయాలను అర్థం చేసుకొని దేశ ప్రజానీకానికి తగ్గట్టు చట్టాలు ఉండాలని పోరాడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని కొనియాడారు కమ్యూనిస్టు పార్టీలో మూడు తరాల వ్యక్తులతో పనిచేసిన సీతారాం తన మేధస్సునంత ఉపయోగించి భారతదేశానికి విశేష సేవ అందించారని అనేక రైతాంగ కార్మిక విద్యార్థి యువజన ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని విజయాలు సాధించారని పేర్కొన్నారు.
భారతదేశంలోని కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి దౌత్యవ్యక్త గా వివాదాల పరిష్కారకునిగా భారతదేశ ప్రతిష్టను ఇనుమడింప చేశారని పేర్కొన్నారు.
ఆయన నడిచిన బాటలో పేద మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడమే ఈరోజు మనందరి బాధ్యతని పేర్కొన్నారు. సీతారాం గారికి నిజమైన నివాళి ఆయన ఆశయాలు ముందుకు తీసుకోవడమేనని భవిష్యత్తులో వామపక్షాలు ఆయన ఆశయాలు ముందుకు తీసుకోవడంలో అందరూ సహకరిస్తారని పేర్కొన్నారు.
సమ సమాజ నిర్మాణం కోసం ఆయన కన్న కలలు నిజం చేసే విధంగా నేటి కార్యకర్తలు పనిచేయాల్సి ఉంటుందని ఆ బాధ్యత నేటితరం భుజాన చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మరియు ఆ పార్టీ ప్రజాసంఘాల నాయకులు అశోక్, సూరి ,యుసుప్ బాషా, మహబూబ్ బాషా, బజారి, గాజుల శ్రీనివాసులు, లక్ష్మిరెడ్డి, నాగేష్ ,మహేంద్ర ,నాగేంద్ర, బలరాముడు, వీరేంద్ర ,పరమేష్ ,జ్యోతి వెంకటేష్ ,మనోహర్ ,సుధాకర్, రవి ,సుభాన్ ,సుంకన్న, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.
Andhrapradesh
సాంప్రదాయాన్ని పాటిస్తూ ,ఆచార వ్యవహారాలు కాపాడుకుందాం…
సాంప్రదాయాన్ని పాటిస్తూ ,ఆచార వ్యవహారాలు కాపాడుకుందాం…
బన్ని ఉత్సవాన్ని ప్రశాంతంగా సంతోషంగా జరుపుకుందాం…
ఏ దేవుడు ఏ మతము రక్తపాతాన్ని కోరదు…
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన…
కర్నూలు / ఆలూరు అక్టోబర్ 16 :- దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి సన్నిధిలో బన్ని ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన మాట్లాడుతూ… ఏ దేవుడు ఏ మతము రక్తపాతాన్ని కోరుకోదని , సాంప్రదాయాన్ని , ఆచార వ్యవహారాలు పాటిస్తూ పండుగ ప్రశాంతంగా ఆనందంగా జరుపుకోవాలని సమావేశానికి హాజరైన ఉత్సవ కమిటీ సభ్యులను , గ్రామస్తులను ,అధికారులను కోరారు.
ఈనెల దసరా ఉత్సవాల సందర్భంగా 24వ తారీఖు రాత్రి జరుగు మాళ మల్లేశ్వర స్వామి కళ్యాణము సందర్భంగా జరుగు బన్ని ఉత్సవానికి రాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల నుండి కూడా దాదాపు లక్ష యాభై వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు కావలసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన మాళ మల్లేశ్వర స్వామి సన్నిధిలో సమీక్షించారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులను, అధికారులను మరియు గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆలయ సాంప్రదాయాలు , ఆచార వ్యవహారాలు కాపాడుకుంటూ క్రమశిక్షణతో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ చట్టాన్ని గౌరవిస్తూ పండుగలు జరుపుకోవాలని ఈ సందర్భంగా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని గాయాలు పాలు కాకూడదని కోరుకుంటున్నానని తెలిపారు. ఏ దేవుడు ఏ మతము రక్తపాతము కోరుకోదని తెలిపారు. పూర్వకాలంలో నడక ద్వారా మాళ మల్లేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రాత్రివేళ భక్తులు వచ్చేవారు .ఆ సమయంలో జంతువులు, విష సర్పాల భారి నుండి కాపాడుకోవటానికి గాను కర్రలను వాటికి శబ్దం చేసే గజ్జలు , రింగులు వాడుకోవడం ఆనవాయితీగా ఉన్నది. ఆ కర్రలతో రాత్రి వేళలో తమను తాను రక్షించుకోవడానికి మరియు ఎత్తైన కొండలు అధిరోహించడానికి వాడేవారు . ఇప్పుడు ఆ కర్రలను బన్ని ఉత్సవం సందర్భంగా ఇతరులను గాయపరచడానికి వాడటం సరికాదని తెలిపారు. దేవుని పేరుతో ఏ సాంప్రదాయము హింసను కోరుకోదని కావున కర్రలు వినియోగించరాదని హితవు పలికారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు సమకూరుస్తామని ఉత్సవాన్ని ప్రశాంతంగా సంతోషంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంస్కృతి సంప్రదాయాలు గౌరవించాలని అదే సమయంలో ఇతరులను బాధపెట్టే విధంగా ప్రవర్తించరాదని తెలిపారు . ఈసారి బన్ని ఉత్సవాలకు దాదాపు 100 రాత్రి వీడియో కెమెరాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని , దాదాపు 5 అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నామని , అగ్నిమాపక యంత్రాలు , ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఇప్పటికే సారా నియంత్రణ మరియు కర్రల స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టామని తెలిపారు . ప్రతి ఒక్కరి రక్షణ కొరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ విషయంలో ప్రజల సహాయ సహకారాలు కోరుకుంటున్నామని మీ సహకారంతో బన్ని ఉత్సవం ప్రశాంతంగా సంతోషంగా సాంప్రదాయ బద్ధకంగా జరుపుకుందామని కోరారు.
ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ బన్ని ఉత్సవాల ఏర్పాట్ల సందర్భంగా ప్రసంగిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని వసతులు , ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు .ఈ ప్రాంతం మొత్తం ప్రకాశవంతంగా ఉండడానికి ఎత్తైన లైట్లు , జనరేటర్ ఏర్పాట్లు చేస్తున్నామని , త్రాగునీరు , ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు . పరిసర గ్రామాల్లో ఈ ఉత్సవాల్లో మద్యాన్ని వాడకుండా , కర్రలు తీసుకొని రాకుండా సాంప్రదాయబద్ధంగా క్రమశిక్షణతో ఉత్సవాన్ని జరుపుకోవడానికి గాను అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు . రాత్రిపూట స్పష్టంగా అగుపించే కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా అసాంఘిక శక్తులు , క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని తెలిపారు.
కర్నూలు జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ యం. రామాంజనేయులు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా , వివాదరహితంగా జరుపుకోవడానికి సహకరించాలని , దేవాదాయశాఖ తరఫున అన్ని విభాగాలతో సహాయ సహకారాలు తీసుకుంటూ భక్తులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు . అందుకు భక్తులు కూడా మా సేవలు వినియోగించుకోవాలని ఉత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారి మనోహర్ స్వామి క్షేత్రం యొక్క మహత్యం ఆలయ ప్రాశస్త్యం తెలిపారు. మనోహర్ స్వామి మాట్లాడుతూ మనకున్న లెక్కల ప్రకారం 500 సంవత్సరాల క్రితం నుండి ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని అప్పటినుండి ఇప్పటివరకు సాంప్రదాయంగా జరుపుకుంటున్నామని , ఇప్పుడు కూడా ప్రజలు దేవస్థానానికి , క్రమశిక్షణతో ఉండి ప్రభుత్వానికి సహకరించి ఉత్సవాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. బ్రిటిష్ వారు కూడా ఈ ఉత్సవాలను పరిశీలించి మెచ్చుకునే వారని తెలియజేశారు.
ట్రస్ట్ బోర్డు మెంబర్ వీరనాగ మాట్లాడుతూ ఈ ప్రాంతానికి వచ్చే మార్గాన్ని సిసి రోడ్డు గా మార్చడానికి చర్యలు తీసుకోవాలని , ఈ ప్రాంతంలోని రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయని వాటి విస్తరణకు కూడా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.
-
Andhrapradesh1 year ago
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భధ్రత … 1,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.
-
Andhrapradesh1 year ago
పాలస్తీనా పై ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాక్రమణ దాడులను ఖండించండి!!
-
Andhrapradesh1 year ago
అసహనం లో SBI కస్టమర్స్.. నిలిచిన UPI సేవలు.
-
Andhrapradesh1 year ago
సాంప్రదాయాన్ని పాటిస్తూ ,ఆచార వ్యవహారాలు కాపాడుకుందాం…
-
Andhrapradesh2 months ago
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..
-
Andhrapradesh1 year ago
వైద్య రంగంలో వినూత్న మార్పులు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
-
Telangana1 year ago
దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా
-
Andhrapradesh1 year ago
ప్రతి ఎకరాకు నీరు వచ్చేవరకు ఐక్యంగా పోరాడుదాం..