Andhrapradesh
మళ్ళీ నువ్వే కావాలి జగనన్న ..గుమ్మనూరు శ్రీనివాసులు.

సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపినందుకే రాష్ట్రానికి సీఎం జగన్ అవసరమని అన్ని వర్గాలప్రజలు కోరుకుంటున్నారని శుక్రవారం దేవనకొండ పట్టణంలోని 2 వ సచివాలయం లో పరిధిలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ కు జగన్ మళ్ళీ ఎందుకు కావాలి అని కార్యక్రమం వైసీపీ మండలం కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జున జడ్పిటిసి రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మళ్ళీ సీఎం జగనే ఎందుకు కావాలంటే నిర్వహించిన సమావేశంలో మలమల్లేశ్వర స్వామి దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనురు శ్రీనివాసులు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు చేయని విధంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధితో ముందుకు నడిపిస్తున్నారన్నారు.
ఎన్నికలు దగ్గరికి వస్తున్న తరుణంలో జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి ఎందుకు కావాలన్న అంశంపైన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు,నాయకులు ఈ నాలుగన్నరేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని చెప్పేందుకు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నకార్యక్రమమన్నారు.2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో లో చెప్పిన హామీలన్నింటిలో ఏమేమి నెరవేర్చాము, ఏ ఇంటికి ఏయే సంక్షేమ పథకాలు అందాయి అని ధైర్యంగా ప్రతి గడప కు వెల్లుచున్నామన్నారు. దేవనకొండ 2వ సచివాలయం లోని వార్డులో ప్రభుత్వం నవరత్నాల పథకం కింద ఆమ్మవడి, విద్యాదీవెన, వసతి దీవెన,వైఎస్సార్ ఆసరా, చేదోడు, వాహనమిత్ర, పింఛన్లు, నాడు నేడు, గడపగడప మన ప్రభుత్వం ద్వారా రూ. 26,34,54,027 లబ్ది చేకూర్చడం జరిగిందని తెలిపారు. అర్హులైనప్రతి ఇంటికీ సంక్షేమ లబ్దిని చేకూర్చినందునే వై నాట్ 175 అంటున్నామన్నారు.
అయితే టిడిపి వాళ్ళు భవిష్యత్ కు గ్యారంటీ అనే కార్యక్రమం చేపడుతున్నారని, 2014 ఎన్నికలప్పుడు ఒక మేనిఫెస్టో ని ఇచ్చి విజయం సాధించి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారన్నారు. ఆ మ్యానిఫెస్టో లో ఎన్ని హామీలు నెరవేర్చారో ఫలానా వాళ్లకు ఫలానా మేలు చేశామని ప్రతి గడప కు కరపత్రాలను ఇచ్చే దమ్ము, ధైర్యం టిడిపికి ఉందా అని దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు ప్రశ్నించారు.
చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా తాము అధికారంలోకి వస్తే అవి చేస్తాం, ఇవి చేస్తాం అని టి .డి .పి. వాళ్ళు చెబుతుంటే ప్రజలు ఎవ్వరూ నమ్మడం లేదన్నారు.జగన్ పాలనలోనూ, టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. కార్యక్రంలో ఎంపిడిఓ గౌరీదేవి , పంచాయతీ సెక్రటరీ అబ్బుల్ల రహిం వైసీపీ నాయుకులు ,శాంతి,సురేంద్ర రెడ్డి, కుమార్,రాజ రెడ్డి, పల్లేదొడ్డి చంద్ర ఎంపీటీసీ లు , సర్పంచులు కుంకునూరు సచివాలయ కన్వీనర్ మల్లికార్జున్ రెడ్డి గిత్త పరమేష్ , వాలంటరీలు సచివాలయ సిబ్బంది తదితరాలు పాల్గొన్నారు.
Andhrapradesh
గిట్టుబాటు ధర హామీ అమలు చేయకపోతే, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని కుదిపేస్తాం!

Andhrapradesh
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.

కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వెనుకబడిన ఆలూరు నియోజవర్గంలో వేదావతి మరియు నాగరడోన రిజర్వాయర్ మరియు సాగు, మరియు తాగు నీరు సమస్యలు, రోడ్లు, నియోజకవర్గంలో వలసలు వంటి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది..
Andhrapradesh
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..

హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప పాండురంగ తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము గిర్రప్ప గారి నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు శివప్ప నాగేష్ ఎర్రి స్వామి ఎర్రప్ప సుంకయ్య సేకయ్య గణేష్ మహేష్ భీమేష్ హరి అశోక్ కుమార్ వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.
-
Andhrapradesh2 years ago
పాలస్తీనా పై ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాక్రమణ దాడులను ఖండించండి!!
-
Andhrapradesh2 years ago
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భధ్రత … 1,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.
-
Andhrapradesh2 years ago
అసహనం లో SBI కస్టమర్స్.. నిలిచిన UPI సేవలు.
-
Andhrapradesh9 months ago
పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..
-
Andhrapradesh9 months ago
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి… సహాయ సహకారాలు అందించండి.
-
Andhrapradesh2 years ago
సాంప్రదాయాన్ని పాటిస్తూ ,ఆచార వ్యవహారాలు కాపాడుకుందాం…
-
Andhrapradesh1 year ago
మండలంలోని సాగునీటి సమస్యలపై ప్రధాన రాజకీయ పార్టీలు తమ వైఖరి వెల్లడించాలి….సీపీఎం
-
Andhrapradesh1 year ago
ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం.